Breaking News

Daily Archives: May 29, 2025

రైతు అవసరాలకు తగ్గట్లు పరిశోధనలు చేపట్టాలి…

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు -శాస్త్రవేత్తలకు సూచించిన డిల్లీ రావు -యన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని డాక్టర్ కె ఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం లో వికసిత కృషి సంకల్పఅభియాన్ పాల్గొన్న వ్యవసాయ సంచాలకులు . -దేశములో మొట్ట మొదట సారిగా శాస్తవేత్తలతో ఖరీఫ్ సన్నద్ధత,అవగాహన పై గ్రామస్థాయిలో రైతుల పంట పొలాల్లో పరిశీలన -కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న అవగాహన కార్యక్రమం  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ శాస్త్ర వేత్తలు …

Read More »

వెహికల్ డిపో లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం ఉదయం వేహికాల్ డిపో, గవర్నర్‌పేట లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు వి యం సి ఫైర్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, …

Read More »

వ్యర్ధాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ పర్యటించి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేషనల్ సఫాయి కర్మచారి పథకం లో భాగంగా కొత్తగా వచ్చిన ఐదు పెద్ద టిప్పర్ వాహనాలను పరిశీలించారు. …

Read More »

జూన్ 4వ తేదీ యోగాంధ్ర 2025 మెగా యోగా కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీ ఉదయం స్థానిక ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం ఎదురు రోడ్ (యోగా రోడ్)లో నగర ప్రజలు, విద్యార్ధులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్చంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్ తో కలిసి మెగా యోగా కార్యక్రమం చేపట్టనున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

వర్షం నీరు రోడ్ల మీద నిలవకుండా డ్రైన్లలోకి వెళ్లేలా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షం నీరు రోడ్ల మీద నిలవకుండా డ్రైన్లలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ప్రధాన డ్రైన్లలో పూడిక తీత పనులను వేగవంతం చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం కమిషనర్ గారు బాలాజీ నగర్, పాత గుంటూరు తదితర ప్రాంతాల్లో పూడికతీత పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలకు డ్రైన్లలో నీరు సక్రమంగా …

Read More »

టిడ్కో గృహ సముదాయాల వద్ద మౌళిక వసతుల కల్పనకు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల వద్ద మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ గారు అడవితక్కెళ్లపాడులోని టిడ్కో గృహ సముదాయాలను జిఎంసి, టిడ్కో ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, మౌలిక వసతులపై ప్రజల తెలిపిన సమస్యలను తెలుసుకొని, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అడవితక్కెల్లపాడులోని టిడ్కోఇళ్లల్లో షుమారు 13 వందల …

Read More »

పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఇండస్ట్రీయల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ ( డీఐఈపీసీ) సమావేశం జరిగింది. సమావేశంలో అజెండాకు సంబంధించి చర్చించిన అంశాలపై జిల్లా …

Read More »

భారీ వర్షాలకు నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాబోవు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల మేరకు నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని, ప్రజలు తమ ప్రాంతాల్లో వర్షాల వలన తలెత్తే సమస్యలు తెలపడానికి జిఎంసి కాల్ సెంటర్ (08632345103) 24 పని చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం వలన ప్రజలకు ఏ సమస్య …

Read More »

జాయింట్ మెజర్మెంట్ సర్వేను వెంటనే ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి ఎన్ హెచ్ 544డి వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు లైన్ల రహదారి కొనసాగింపులో జిల్లా పరిధిలోని రహదారి విస్తరణ ప్రాంతంలో జాయింట్ మెజర్మెంట్ సర్వేను వెంటనే ప్రారంభించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ ఎన్ హెచ్ 544డి గుంటూరు వరకు కొనసాగింపు పనులపై జాతీయ రహదారులు, రెవిన్యూ …

Read More »

సూర్యకుమారి ఐ.ఏ.ఎస్. ని కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తదుపరి రాయపాటి శైలజ ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ లోని మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన సెక్రటరీ సూర్యకుమారి ఐ.ఏ.ఎస్. వారిని గురువారం  మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంలో ఇరువురూ మహిళా కమిషన్ కు సంబంధించిన విధివిధానాల గురించి చర్చించుకోవడం జరిగింది మరియు ఈ సందర్భంలో సూర్యకుమారి గారు ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమలలో పనిచేయుచున్నటువంటి మహిళా కార్మికులకు సంబంధించి వారి పని ప్రదేశంలో …

Read More »