Breaking News

Daily Archives: May 29, 2025

సుజనా చౌదరి కోలుకుంటున్నారు…

-ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ ( సుజనా చౌదరి) కోలుకుంటున్నారని ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ అన్నారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడగా శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోనీ తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరామర్శించారు. …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి కోలుకోవాలని సాయిబాబా ఆలయంలో పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) త్వరగా కోలుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు బొబ్బిలి లీల కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గురువారం గొల్లపాలెం గట్టు సాయిబాబా ఆలయంలో బొబ్బిలి లీలా కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి పాల్గొని బాబా ఆశీస్సులు అందుకున్నారు. మే మొదటి వారంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రమాదవశాత్తు గాయపడి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల …

Read More »

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ఈనెల 31వ తేదీన ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు జూన్ 1, 2025 నుండి ఆగష్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు శ్రీ హిమాన్షు శుక్ల గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు …

Read More »

మంగినపూడి బీచ్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్

-బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమం, మసులా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 31వ తేదీన మంగినపూడి బీచ్ లో జరిగే యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మంగినపూడి బీచ్ వద్ద జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమం, మసులా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించారు. …

Read More »

నగర పాలక సంస్థ ఉద్యోగులకు యోగ శిక్షణ తరగతులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగ తో మానసిక, శారీరక రుగ్మతలు మటుమాయం అవుతాయని మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు అన్నారు.మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్యాలయం సమావేశపు హాలులో గురువారం ఉదయం యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు‌. ఈ శిక్షణ తరగతులను కమీషనర్ బాపిరాజు ప్రారంభించి ప్రసంగించారు. యోగాంధ్ర కార్యక్రమం లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఉద్యోగుల తో పాటు ఉపాధ్యాయులు నగరంలోని యువతీ యువకులు, డ్వాక్రా మహిళలు, నగర ప్రముఖులు పాల్గొనాలన్నారు. యోగాంధ్ర యాప్ లో నగరంలోని ప్రతి …

Read More »

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యమే మహాభాగ్యం, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం తెల్లవారుజామునే జిల్లా కలెక్టర్ ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీనగర్ వాకర్స్ అసోసియేషన్ హాల్లో యోగ గురువు చింతయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొని సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామాలు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే యోగా చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా …

Read More »

ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని నడిపించడంలో మంత్రిత్వ శాఖలతో చేతులు కలిపిన యోగ సంస్థలు

-దేశవ్యాప్త సంసిద్ధతను సమీక్షించిన అంతర్‌ మంత్రిత్వ కమిటీ: విశాఖపట్నం నుంచి జాతీయ స్థాయి యోగా మహోత్సవానికి నేతృత్వం వహించనున్న ప్రధానమంత్రి హైదరాబాద్,  నేటి పత్రిక ప్రజావార్త : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడివై ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా, సంబంధిత మంత్రిత్వ శాఖల కమిటీ న్యూఢిల్లీ చాణక్యపురి లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించి, అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించడంపై చర్చించాయి. సంపూర్ణ ప్రభుత్వ విధానం ( హోల్ …

Read More »

జిల్లా లో ప్రతీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్నాం.

-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయికి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, పరిష్కారం కానీ వాటి విషయంలో ప్రత్యక్షంగా ఆయా వ్యక్తుల, అధికారులు లతో సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్ట ర్ క్యాంప్ కార్యాలయంలో పిజిఆర్ఎస్ పై ప్రజా సమస్యల పరిష్కర స్థాయి పై వివిధ …

Read More »

సైనిక్ సంక్షేమ నిధి విరాళాలు వారి ఆర్థిక భరోసా కల్పిం చే విధంగా చర్యలు తీసుకుంటాం.

-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సైనిక్ సంక్షేమ నిధికి వొచ్చిన విరాళాలు ఇచ్చి సైనికులు , వారి కుటుంబాల ఆర్థిక భరోసా, సంక్షేమ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పిడి, డిఆర్డిఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులు అందించిన 6,37,790 రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్, ఎస్పీ వారి చేతుల మీదు సైనిక్ వెల్ఫేర్ అధికారికి కు అందచేశారు. ఈ సందర్భంగా …

Read More »

చిల్డ్రన్ వసతి గృహము సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి స్థానిక ఉమెన్స్ కాలేజీ సమీపంలోని ఉన్న బాలసదానం గవర్నమెంట్ చిల్డ్రన్ వసతి గృహమును సందర్శించారు. వసతి గృహమును సందర్శించి వసతులను మరియు ఆహారన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్ధులకు సురక్షిత త్రాగు నీరు, మంచి ఆహారం అందించాలనన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మత్తులను ఎప్పటికప్పుడు చేయించాలని అన్నారు, …

Read More »