Breaking News

Daily Archives: May 31, 2025

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం రాష్ట్ర మంత్రి నగరంలోని వారి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మంత్రి ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని రాష్ట్ర …

Read More »

నగర ప్రజలకు సకాలంలో ఎన్టీఆర్ భరోసా- పెన్షన్ల పంపిణీ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మి షా తో కలిసి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం సత్యనారాయణపురం పురుషోత్తమ వీధి, పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. జూన్ 1, 2025 ఆదివారం అయినందున, ప్రజలకు ఎన్టీఆర్ భరోసా అందటంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదు అన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా …

Read More »

పిల్లల మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ముఖ్యం- డాక్టర్ KNBS లత, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్చార్జి, విఎంసి

-క్రీడలు చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి – జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంచార్జ్ డాక్టర్ KNBS లత అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాల మేరకు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో భాగంగా వేసవి క్రీడా శిక్షణలో పాల్గొన్న బాల బాలికలకు ముగింపు కార్యక్రమంలో గురు నానక్ కాలనీ, స్విమ్మింగ్ పూల్ నందు ఈత పోటీలు నిర్వహించి, ప్రతిభావంతులకు మెడల్స్ …

Read More »

నగరంలోని కర్మల భవనాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర హెచ్ఎం ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని కర్మల భవనాలన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశించారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అయోధ్య నగర్, సత్యనారాయణ పురం, జిఎస్ రాజు రోడ్ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జి.ఎస్ రాజు రోడ్ లో గల పాత కర్మల భవనంను కూల్చేసిన తరుణంలో నూతన …

Read More »

రండి.. పరిక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి..

-ఢిల్లీ సీఐఐ వార్షిక సదస్సులో పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం -రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ఏపీ సీఎం -అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపు -2026 జనవరికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిద్దమని ప్రకటన -ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక వేత్తలు సిద్ధం కావాలన్న చంద్రబాబు -సీఎం సమాధానాలపై పారిశ్రామిక వేత్తల హర్షం.. స్టాండింగ్ ఓవేషన్ తో గౌరవించిన సీఐఐ ప్లీనరీ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా …

Read More »

“ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద వెలికితీత: అన్వేషణ నుంచి వేలం వరకు – వ్యూహాత్మక దీర్ఘకాలిక ప్రణాళిక”

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గనుల మరియు భూగర్భ శాస్త్ర శాఖ, భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ, జాతీయ ఖనిజ అన్వేషణ ట్రస్ట్ (ఎన్‌ఎంఈటి) సంయుక్తంగా “ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద వెలికితీత అన్వేషణ నుంచి వేలం వరకు – వ్యూహాత్మక దీర్ఘకాలిక ప్రణాళిక” అనే ఉన్నత స్థాయి వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత భూగర్భ సర్వే (జిఎస్‌ఐ), మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎంఈసిఎల్),ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎం), ఎన్‌ఎంఈటి,గనుల భద్రతా డైరెక్టరేట్ జనరల్ …

Read More »

పి.ఎమ్.సూర్యఘర్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలి

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి సూర్యఘర్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి పి.ఎమ్.సూర్యఘర్ యూనిట్ల స్థాపన ప్రగతిని సమీక్షించారు. పి.ఎమ్.సూర్యఘర్ యూనిట్ల స్థాపన కై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 వేల మంది ధరఖాస్తుచేసుకోగా, ఇప్పటి వరకూ కేవలం 12,172 యూనిట్లను మాత్రమే స్థాపించడం జరిగిందన్నారు. ప్రతి …

Read More »

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

-ముమ్మిడివరం నియోజకవర్గం, చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం -వరుసగా 12వ నెల ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -ఏడాది కాలంలో రూ.34 వేల కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేసి రికార్డు సృష్టించిన కూటమి ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును నేరుగా …

Read More »

యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా శిక్షణ నివ్వాలి

-ఆరోగ్య ఆనంద స్వ‌ర్ణాంధ్ర సాకారమే యోగాంద్ర-2025 అంతిమ లక్ష్యం -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారమే యోగాంధ్ర-2025 కార్యక్రమ అంతి లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకై యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఆరోగ్య ఆనంద స్వ‌ర్ణాంధ్ర సాకారానికై ఈ నెల 21న ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని …

Read More »

విశాఖలో 5లక్షల మందితో యోగాసనాలు ద్వారా గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యం : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి సమక్షంలో నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కనీసం 5లక్షల మంది ద్వారా యోగాసనాలు వేయించడం ద్వారా సమీప భవిష్యత్తులో ఎవరూ ఆ రికార్డును అధికమించని విధంగా గిన్నిస్ రికార్డును సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో యోగాంధ్ర-2025పై ఆయన పలు శాఖల కార్యదర్శులతో 11వ అంతర్జాతీయ యోగా ఏర్పాట్లపై సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ …

Read More »