Breaking News

Monthly Archives: May 2025

యోగాంధ్ర కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 31వ తేదీన మంగినపూడి బీచ్ లో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మంగినపూడి బీచ్, మచిలీపట్నం నగరంలో యోగాంధ్ర కార్యక్రమాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రముఖ పర్యాటక …

Read More »

ఇసుకను నిల్వచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెలాఖరికి జిల్లాలోని 6 స్టాక్ పాయింట్లలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. స్టాక్ యార్డ్ వద్ద ప్రజలు ఇసుక కొనుగోలు చేయుటకు వీలుగా కలెక్టర్ అధికారులతో చర్చించి ధరలు నిర్ధారించారు. ఈ …

Read More »

యోగాతో సంపూర్ణ ఆరోగ్య యోగం..

– యోగాస‌నాలు మ‌నిషి ఆరోగ్యానికి దారిదీపాలు – విజ‌య‌వంతంగా యోగాంధ్ర మాసోత్స‌వాల ఏడో రోజు కార్య‌క్ర‌మాలు – వీఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌నిషి సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం వేసే యోగా విశిష్ట‌త‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, జీవితంలో యోగాస‌నాల అభ్య‌స‌న‌ను భాగం చేసుకునేలా ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న యోగాంధ్ర మాసోత్స‌వాల సంద‌ర్భంగా జిల్లా వ్యాప్తంగా, విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ప్ర‌తిరోజూ యోగా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. …

Read More »

మ‌న‌మిత్ర పారిశ్రామిక సేవ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించండి

– సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకునేలా పారిశ్రామిక వ‌ర్గాల‌ను ప్రోత్స‌హించండి – గ‌డువుకు ముందే పారిశ్రామిక అనుమ‌తుల జారీపై దృష్టిపెట్టండి – పారిశ్రామిక యూనిట్ల‌కు రూ. 4.13 కోట్లు మేర ప్రోత్సాహ‌కాల‌కు ఆమోదం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వం యాప్ ఆధారిత డిజిట‌ల్ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ (మ‌న‌మిత్ర‌) ద్వారా ప్ర‌జల‌కు 500కు పైగా సేవ‌లు అందిస్తోంద‌ని, ఇందులో అందుబాటులో ని పారిశ్రామిక సేవ‌లపై పారిశ్రామిక‌వేత్త‌లు, పారిశ్రామిక సంఘాల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్రోత్స‌హించాల‌ని …

Read More »

మోడీ ఒక విఫల ప్రధాని… : కె.రామకృష్ణ

-జపాన్‌ ఆర్థిక వ్యవస్థతో పోలికకాదు.. భారత్‌ చైనాతో పోటీపడాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో రూపాయి విలువ తగ్గించి, పేదరికం, నిరుద్యోగాలను పెంచిన నరేంద్రమోడీ విఫల ప్రధానిగా ఖ్యాతికెక్కారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో 4వ స్థానానికి చేరిందని, అందుకు ప్రధాని నరేంద్రమోడీ విధానాలే కారణమని గత రెండుమూడు రోజులుగా ఎన్‌డిఎ నేతలు పెద్దఎత్తున ఊదరగొడుతున్నారు. ఇందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చెయ్యాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, పటమట, రాణి గారి తోట, కృష్ణలంక వారధి, ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటమట నిర్మలా కాన్వెంట్ వద్ద తరచుగా వర్షపు నీటి నిలువలు ఏర్పడటం గమనించి వాటిని మళ్లించేందుకు కృష్ణవేణి …

Read More »

ఇళ్ల స్థలాలు దక్కేవరకు పేదల పోరాటం ఆగదు!

-జూన్ 2న మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనలు జయప్రదం చేయండి! -ఉపాధి హామీలో సకాలంలోకూలీలకు పని కల్పించకపోతే ఉపాధి భృతి ఇవ్వాలి! -ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేతలు ప్రభుత్వానికి హెచ్చరిక! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు నివాసయోగ్యమైన ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ జూన్‌ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగే …

Read More »

ప్రభుత్వానికి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్ లో పండించే పంటలకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, సూక్ష్మ పోషకాలు, పచ్చిరొట్ట విత్తనాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడీ యల్లమందారావు, కౌలురైతుల సంఘం జిల్లా నాయకులు నిమ్మగడ్డ వాసు తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ మొదటి వారం నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నప్పటికి ఇంతవరకు పంటల వారీగా ప్రణాళికలు, క్రెడిట్ ప్రణాళికలు, …

Read More »

జూన్ తొలి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా ప్రారంభం -వివరాలు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష -త్వరలోనే పట్టాలెక్కనున్న అఖండ గోదావరి, గండికోట పర్యాటక ప్రాజెక్టులు, సూర్యలంక బీచ్ ఆధునికీకరణ పనులు -కుంభమేళా స్ఫూర్తితో 21 ప్రధాన పుణ్యక్షేత్రాల సమీపంలో పర్యాటకులకు తక్షణ వసతి సౌకర్యాలు కల్పించేలా చర్యలు -రాష్ట్రంలో హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు, లీజుకు మండువా లోగిళ్లు తీసుకునేలా ప్రణాళికలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ మొదటివారంలో అఖండ గోదావరి ప్రాజెక్టు …

Read More »

ఏపీలో ఆయుష్‌ను గ‌త ప్ర‌భుత్వం పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది

-కూట‌మి ప్ర‌భుత్వ‌మొచ్చాక ఆయుష్‌ను బ‌లోపేతం చేశాం -రాజ‌ధాని అమ‌రావ‌తిలో గ్లోబ‌ల్ మెడిసిటీ -దేశీయ‌,అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల్ని ఆక్షించేందుకు ఏపీలో స‌ద‌స్సు నిర్వ‌హిస్తాం -ఆయుష్ ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు -ఏపీలోని అన్ని పర్యాటక ప్ర‌దేశాల్లో హెల్త్ వెల్నెన్ సెంట‌ర్ల‌ను విస్త‌రిస్తాం -చెన్నైలో జ‌రిగిన ద‌క్షిణాది మంత్రులు, అధికారుల ఆయుష్ స‌ద‌స్సులో మంత్రి స‌త్య‌కుమార్ వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త ప్ర‌భుత్వం ఆయుష్‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింద‌ని వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కూట‌మి …

Read More »