Breaking News

Monthly Archives: May 2025

యువ యోధులు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ముందున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 6, 2025న జరుపుకుంటారు. దీని ప్రకారం, గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఈరోజు ఈ క్రింది కార్యకలాపాలు జరిగాయి. సుధేష్నాసేన్, DRM/GNT తన ప్రసంగంలో పర్యావరణ అనుకూల అలవాట్ల ప్రాముఖ్యత గురించి ప్రజలను ప్రేరేపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణాన్ని మరియు వ్యక్తి ఆరోగ్య ప్రమాదాలను కాపాడే మంచి జీవనశైలిని అనుసరించాలని DRM అందరినీ కోరారు. గుంటూరు స్టేషన్‌లో పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడానికి నుక్కడ్ నాటకం నిర్వహించారు. గుంటూరు డివిజన్ యువ యోధులు …

Read More »

జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘముల ఒకటి నుండి ఏడు సమావేశాలు గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగాయి. వీటిలో రెండవ స్థాయి సంఘ సమావేశం కోరం లేక వాయిదా పడింది. మిగిలినవి యధావిధిగా జరిగాయి. 1, 4, 7 స్థాయి సంఘ సమావేశాలకు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించారు. మూడవ స్థాయి సంఘ సమావేశానికి దుర్గి ఎంపిటిసి శెట్టిపల్లి యలమంద అధ్యక్షత వహించగా, …

Read More »

ప్రతి ఒక్కరు క్రీడాస్పూర్తిని కలిగి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల్లో గెలుపోటములు సహజమేనని ప్రతి ఒక్కరు క్రీడాస్పూర్తిని కలిగి ఉండాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం గుంటూరు నగర పాలక సంస్థ ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడాప్రాంగణం మరియు స్విమ్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు 2025 ముగింపు వేడుకలకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి లతో నగర మేయర్ పాల్గొని క్యాంపు లో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసా పత్రాలు మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా …

Read More »

ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ శనివారం నాటికే నూరు శాతం కార్యదర్శులు అందించేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు వడ్డె గూడెంలో పించన్ల పంపిణీ, లాంచెస్టర్ రోడ్ లో పారిశుధ్య పనులు, జాతీయ రహదారి దగ్గర అవుట్ ఫాల్ డ్రైన్ ని పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జూన్ …

Read More »

మాకు న్యాయం చేయండి… : బాధితురాలు రావులమ్మ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రెస్క్లబ్లో జగ్గయ్యపేట కి చెందిన ముక్కల రావులమ్మ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ముక్కల రావులమ్మ మీడియాతో మాట్లాడుతూ జగ్గయ్యపేట మున్సిపాలిటీ లో స్వీపర్ గా పనిచేస్తున్నాను. నా కొడుకు చనిపోయిన బాధలో నేను ఇంటి వద్దనే ఉండగా ఇదే అదునుగా భావించి నా ప్రమేయం లేకుండా దొంగ సంతకాలు, వేలిముద్రలు ఫోర్జరీ చేసి నా కూతురు వేముల నాగేంద్ర,అల్లుడు వేముల గోపాల్ ఉద్యోగం కాజే శారని ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం

-జూన్ నెల 2వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం జిల్లా కేంద్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మరియు రెవిన్యూ డివిజన్ , మండల కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జూన్ నెల 2వ తేదీ …

Read More »

జూన్ 4 తేదీన చంద్రగిరి కోట వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి…

-పెద్ద ఎత్తున ప్రజలు, యువత తదితరులు పాల్గొనేలా యోగా నిర్వహణ ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 4 తేదీన చంద్రగిరి కోట వద్ద నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, యువత తదితరులు పాల్గొనేలా చూడాలని, యోగా నిర్వహణ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా చంద్రగిరి కోట వద్ద జూన్ 4న నిర్వహించనున్న …

Read More »

తిరుపతి సమాచార శాఖలో ఎ.వి సూపర్ వైజర్ గా పని చేసి పదవీ విరమణ చేసిన పుల్లయ్య సేవలు మరువలేనివి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార శాఖలో వివిధ హోదాలలో పని చేసి ఎ.వి సూపర్వైజర్ గా నేడు పదవీ విరమణ చేసిన వై.పుల్లయ్య సేవలు మరువలేనివని, ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితర సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుపతి సమాచార శాఖలో ఎ .వి.సూపర్వైజర్ గా పనిచేసిన పుల్లయ్య శనివారం పదవీ విరమణ చేసిన సందర్భంగా కలెక్టరేట్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో …

Read More »

జూన్ 5 వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటే మెగా కార్యక్రమం విజయవంతంగా చేపట్టాలి

-ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని పండుగ వాతావరణం లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలి. -మొక్కల పెంపకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటేలా మెగా కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా …

Read More »

ప్రపంచ పొగాకు వ్వతిరేక దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల కృష్ణ నాయక్  ఆధ్వర్యం లో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి స్విమ్స్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించ బడినది. ఈసందర్భంగా వారు ప్రసంగిస్తూ పొగ త్రాగడం, గుట్కా సేవించడం ఆల్కహాల్ తీసుకోవడం వంటి దురలవాట్ల వలన ఊపిరి తిత్తులు దెబ్బ తినడం, కాన్సర్, మరియు హృదయ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాద ముందన్నారు. అందు వలన పొగ …

Read More »