Breaking News

Monthly Archives: July 2026

ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్, …

Read More »

స్పెషల్ ఇంటెన్సీ ప్రీవియషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సీ ప్రీవియషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా పాయకాపురం ప్రాంతంలోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న SIR ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓల ద్వారా జరుగుతున్న ఫారాల సేకరణ, డేటా మ్యాపింగ్, ఆన్‌లైన్ ఎంట్రీ ప్రక్రియలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా 865 కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు

-జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. డి. హరీష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. డి. హరీష్ అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. కె. అర్జునరావు సూచనలతో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం కొత్తపేట …

Read More »

నగరంలో ఘనంగా రూట్స్‌హెల్త్ ఫౌండేషన్ అవార్డ్స్ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఘనంగా రూట్స్‌హెల్త్ ఫౌండేషన్ 13వ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆదివారం నగరంలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సమాజంలో వైద్యులు నిస్వార్థంగా అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, త్యాగాలకు గుర్తుగా, ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తున్న వైద్యులను సన్మానించడం తన అదృష్టమన్నారు. ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతూ, వృత్తిని దైవంగా భావిస్తూ చేసే వృత్తి వైద్య వృత్తని అన్నారు. అనంతరం సేవాభావం, పనిపట్ల నిబద్ధత …

Read More »

కుప్పం క్లస్టర్ల నుంచి మెగాసిటీ మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తులు

-ఐటీసీ, వీఐఎస్వీ సంస్థలతో కుప్పం డెవలప్‌మెంట్ అథారిటీ ఎంఓయూ -ప్రకృతి సేద్యమే భూమి ఆరోగ్యానికి శ్రీరామరక్ష -ఆధునిక వ్యవసాయ విధానాలతో రైతులకు ప్రయోజనం -కుప్పం రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మీయ పలకరింపు సమావేశం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలోనే నదుల అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గంగా- కావేరి అనుసంధానం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు నీటి భద్రతను సాధించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కుప్పంలో స్థానిక …

Read More »

వారం రోజుల జిల్లా పర్యటనల తర్వాత రేపు అమరావతికి సీఎం చంద్రబాబు

-నాలుగు జిల్లాల్లో వరుస కార్యక్రమాలతో బిజీ -హీరో, అడిడాస్, జేఎస్‌డబ్ల్యు వంటి ప్రఖ్యాత సంస్థలకు శంకుస్థాపన -3 రోజుల కుప్పం పర్యటనలో 30కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం -సోమవారం ఉదయం కుప్పం నుంచి నేరుగా వెలగపూడి సచివాలయానికి సీఎం -ఆర్టీజీఎస్, 3 ప్రాంతాల ఎకనమిక్ రీజియన్లపై సీఎం సమీక్ష కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : వరుసగా వారం రోజుల జిల్లాల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరిగి అమరావతికి రానున్నారు. సోమవారం ఆర్టీజీఎస్ సమీక్షతో సహా పలు సమావేశాలు …

Read More »

పేదల జీవితాలు బంగారు మయం కావాలి

-ధనిక-పేద మధ్య అసమానతలు పోవాలి -పేదలను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తోన్న మార్గదర్శులు -బంగారు కుటుంబాలు, మార్గదర్శుల సమావేశలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ప్రాస్పెరిటీ) కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల జీవితాలు బంగారు మయం కావాలనే ఉద్దేశ్యంతోనే పీ4 ద్వారా బంగారు కుటుంబాలు-మార్గదర్శుల విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆదివారం పీ4 …

Read More »

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల గాలింపు ఆపరేషన్

-కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్య్సకారుల గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్టుగార్డు నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP-VS-MM-83 అనే బోటు …

Read More »

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎపి సచివాలయంలో 6 నుండి 8వ తేదీ వరకు ప్రత్యేక శిబిరం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఈనెల 6వ తేదీ నుండి 8వ తేది వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు.ఈప్రత్యేక శిబిరాన్ని 6వ తేది సోమవారం ఉ.10.30గం.లకు ఎపి సచివాలయం మూడవ భవనం అప్సా(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం) హాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, సాయి కాంత్ వర్మ తదితరులు పాల్గోనున్నారు. …

Read More »

గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించాం

– ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖకు చెందిన 10 మంది మత్స్యకారులు సురక్షితం – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నుంచి వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా ఒక మత్స్యకారుడిని సురక్షితంగా రక్షించినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జూలై 5వ తేదీ ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవీ యూనివర్స్ వెల్తీ (MV Universe …

Read More »