Breaking News

Monthly Archives: February 2025

అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా కృష్ణానదిలో పుణ్య స్థానాలు ఆచరించడనికి విచ్చేసిన భక్తులకు గంగానమ్మ ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులకు డ్రింక్స్, మంచినీటి సరఫరా, అల్పాహార వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ నందు వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్  వైసీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వైయస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని ప్రార్దించారు. దేవస్థానం వద్ద గల కృష్ణవేణి ఘాట్ నందు కృష్ణానదిలో పుణ్య స్థానాలు …

Read More »

శివుని అనుగ్రహంతోనే రాష్ట్రాభివృద్ధి సాకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద కృష్ణా నదిలో మహాశివరాత్రి పుణ్యస్నానం చేసి, పితృదేవతలకు తర్పణాలు పిండప్రదానం గావించారు. అనంతరం ముత్యాలంపాడులోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేకార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మహాశివుని ఆశీస్సులు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ పర్వదినాన ఉదయాన్నే లేచి నదీ తీరప్రాంతాలలో స్నానాలు చేసి …

Read More »

ఎన్నికల ఓటింగ్ కు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ కు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్టు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు బుధవారం ఏసీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పోలింగ్ అధికారులకు పంపిణీని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవతేజ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో …

Read More »

ప్రత్యామ్నాయ పత్రాలలో దేనినైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటర్లు పోలింగ్ స్టేషన్లలో గుర్తింపు కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన క్రింది ప్రత్యామ్నాయ పత్రాలలో దేనినైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చుని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. i. ఆధార్ కార్డ్, ii. డ్రైవింగ్ లైసెన్స్, iii.పాన్ కార్డ్, iv. భారతీయ పాస్ పోర్టు V. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు లేదా ఇతర ప్రైవేట్ …

Read More »

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ శెలవు మంజూరు చేయాలి

-శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగస్తులకు పోలింగ్ రోజు 27-02-2025 విధులకు హాజరు లో యాజమాన్యాలు తప్పనిసరిగా వెసులుబాటు కల్పించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గము శాసనమండలి ఎన్నికలకు ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ 27.02.2025 (గురువారం) ఉదయం గం.8.00 ని.ల నుండి సాయంత్రం గం.4.00 ని.ల వరకు జరుగుతున్నందున శాసనమండలి ఎన్నికల్లో …

Read More »

మహా శివరాత్రిని పురస్కరించుకుని శివయ్యకు మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరమశివునికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన సర్వదేవతా హోమాలు, పూర్ణాహుతిలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత సాయిబాబా దర్శనం చేసుకున్నారు. …

Read More »

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ తరలింపు

-గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం స్ధానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగు మెటీరియల్ తరలింపు ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీ. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని 92 పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్, సిబ్బంది 15 రూట్ లలో పంపించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాట్యూటరీ , …

Read More »

శ్రీ దుర్గామల్లేశ్వరులకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాల సమర్పణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరులకు మంగళగిరి శ్రీ శివభక్త మార్కండేయ వంశీకులు బుధవారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై భక్తిశ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి శివభక్త మార్కండేయ వంశీకులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన కైంకర్య పరులుగా ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఎంఎల్సీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అక్రమ మద్యం రాకెట్ భగ్నం

-పశ్చిమ గోదావరి జిల్లా అబ్కారీ, మద్యపానం నియంత్రణ అధికారి డా. కుమరేశన్ -కోళ్ల ఫారంలో దాచిన 4,500 బాటిళ్ల నకిలీ మద్యం స్వాధీనం భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై అక్రమ మద్యం రవాణాపై దృష్టి సారించారు. ఈ క్రమంలో, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన దాడుల్లో భారీ పరిమాణంలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఓ వ్యక్తిని రాయల్ గ్రాండ్ మాల్ట్ విస్కీ (180ml) రెండు బాటిళ్లతో అరెస్టు చేయగా, …

Read More »