Breaking News

Monthly Archives: February 2025

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శనివారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు వారి సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులు, ఆక్వారైతులకు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన (పీఎం – ఎం కె ఎస్ ఎస్ వై) పథకం వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో …

Read More »

రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో డివిజన్, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 2025 ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రకృతి …

Read More »

పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు శానిటరీ సెక్రెటరీ తో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుధ్యంలో మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వ్యర్ధాలు సేకరించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్ధాల నిర్వహణ జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని సేకరించిన …

Read More »

ఒక‌సారి న‌మ్మి మోస‌పోయిన ప్ర‌జ‌లు మ‌ళ్లీ నమ్ముతారని భ్ర‌మ ప‌డొద్దు జ‌గ‌న్

-మీ దివాళాకోరు రాజ‌కీయాల‌కు ఈసారి శాశ్వ‌త స‌మాధే -ఓట‌మిని తట్టుకోలేకే కూట‌మి ప్ర‌భుత్వంపై వైసిపి అస‌త్య ప్రచారాలు -వైసీపీ దుష్ప్రచారాల్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని తెలుసుకో -సామాజిక మాధ్య‌మం ఎక్స్ లో జ‌గ‌న్‌పై విరుచుకుప‌డిన వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మీ నైజం తెలిసాక ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ మళ్లీ నమ్ముతారని భ్రమపడొద్దని, ఈసారి వారిచ్చే తీర్పు ద్వారా మీ దివాళాకోరు రాజ‌కీయ‌ల‌కు శాశ్వ‌త స‌మాధిని క‌ట్ట‌డం త‌థ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ …

Read More »

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటేయండి

-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని సిద్దార్థ నగర్ పాలిక్లినికల్ రోడ్ లోని సిద్దార్థ ఫార్మాసిటికల్ కళాశాలలోని ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ ఓటర్లను శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కలిసి కరపత్రాలు పంపిణి చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యరించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధికి …

Read More »

బుద్ధవరంలో అంగరంగ వైభవంగా అభయ ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం వేడుకలు

-స్వామివారి పట్టు వస్ట్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి ఆలయ కమిటీ వారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. గుదిమెళ్ళ దిలీప్ కుమార్ ఆచార్యుల సమక్షంలో ఉదయం స్వామివారి పంచామృత అభిషేకం, నవరసాభిషేకం, సింధూరభిషేకం పుష్పాభిషేకాలు నిర్వచించారు. అనంతరం గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ హోమం ఆంజనేయ హోమం, శాంతి …

Read More »

సాంస్కతిక వారసత్వాలకు చిహ్నంగా ‘లేపాక్షి’

-సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా నిర్మాణాలు -రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షో రూమ్ ల్లోనూ మరమ్మతులు -ఎస్పీఏవీతో ఏపీహెచ్డీసీ ఒప్పందం -మంత్రి సవిత సమక్షంలో ఎంవోయూపై సంతకాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదనం, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా లేపాక్షి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్పీఏవీ)తో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డవలప్ మెంట్ కార్పొరేషన్(ఏపీహెచ్డీసీ) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ …

Read More »

మెరుగైన ప్ర‌భుత్వ వైద్య సేవ‌లు, ప‌టిష్ట‌మైన పాల‌న‌కు 30 సూత్రాల ఎజెండా

-ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌ల మేర‌కు రూపొందించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల‌కు మెరుగైన ప్ర‌భుత్వ వైద్య సేవ‌లు, వైద్య‌,ఆరోగ్య శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప‌రిపాల‌న‌ను ప‌టిష్టం చేసే ల‌క్ష్యంతో మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ 30 అంశాల‌తో కూడిన ఎజెండాను రూపొందించారు. ఆయా అంశ‌ల‌పై నిర్ధిష్ట కాల‌ప‌రిమితుల మేర‌కు నిరంత‌ర ప్ర‌యాస‌, ప‌నితీరు, ఫ‌లితాల స‌మీక్ష‌లు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  ఎం.టి.కృష్ణ‌బాబును మంత్రి ఆదేశించారు. గ‌తేడాది జూన్‌లో రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన‌ప్ప‌టి నుంచి ఆరోగ్య శాఖ‌కు సంబంధించి …

Read More »

మన నేతన్నకు భరోసా

-ఆప్కో, కో ఆప్టెక్స్ మధ్య కుదిరిన ఒప్పందం -ఏపీ, తమిళనాడు మంత్రులు సవిత, గాంధీ సమక్షంలో ఎంవోయూ -ఒప్పంద పత్రాలు మార్చుకున్న ఎండీలు -ఆప్కో, కో ఆప్టెక్ట్ షోరూమ్ లో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాల విక్రయాలు -పెరిగిన మార్కెట్ తో ఏపీ చేనేత కార్మికులకు మేలు -ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విక్రయించుకునే అవకాశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించే లక్ష్యంలో భాగంగా మరో కీలక ముందుడగు పడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, …

Read More »

విద్యార్థుల్లో మాతృభాషపై అనురక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని అధ్యాపకులకు పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్

-అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని వివరించిన మంత్రి దుర్గేష్ -మాతృభాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాష కోసం కృషి చేసిన గొప్ప సాహితీ వేత్తల శ్రమను నేటి తరానికి తెలిపే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉపాధ్యాయులను కోరారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని …

Read More »