-నలుగురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రజలందరీ సంక్షేమం,అభివృద్ధితో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా ఎన్డీయే కూటమి లక్ష్యమని..ఆ విధంగానే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. నలుగురు లబ్ధిదారులకు అందజేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 4 గురికి …
Read More »Monthly Archives: February 2025
స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడుతూ పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ పై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ, పర్యాటక …
Read More »నేటి తరానికి నిజమైన ఆదర్శప్రాయులు దామోదరం సంజీవయ్య…
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రివర్యులు దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . కార్యక్రమంలో తొలుత దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి తరానికి నిజమైన ఆదర్శప్రాయులు దామోదరం సంజీవయ్య అని, …
Read More »దామోదరం సంజీవయ్య కి ఘన నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతిరత్నం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద కమిషనర్ ధ్యానచంద్ర, దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య, 1960 నుండి 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, ఆయన పాలనలో 1961 లో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం శంకుస్థాపన జరిగిందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ, విద్య, …
Read More »సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాన్ అవగాహన కొరకు వి యం సి లో ప్రత్యేక స్టాల్
-ప్రతి సర్కిల్ పరిధిలో స్టాల్స్ తో అవగాహన పెంచండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు, దాని ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన వస్తువులు చూపించే ప్రత్యేక స్టాల్ ను సందర్శించారు. పర్యావరణహితమైన వస్తువులే వాడాలని, ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజలకు, వినియోగదారులకు, అమ్మేవారికి, …
Read More »అన్న క్యాంటీన్ లలో పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా జరగాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ లలో పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ధర్నా చౌక్ వద్ద గల అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం కొరకు విచ్చేసిన ప్రజలను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ భవనం మొత్తం పర్యటించి వాడుక నీరు, త్రాగునీరు సక్రమంగా వస్తుందా లేదా అని పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల …
Read More »పార్క్ లో సందర్శకులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్క్ కు వచ్చే సందర్శకులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిల్ రోడ్డు, మదర్ తెరెసా జంక్షన్, వెటర్నరీ కాలనీ ప్రాంతాలని పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెటర్నరీ కాలనీలో ఉన్న పార్కును సందర్శించి, అక్కడ వచ్చిన ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పార్క్ లో …
Read More »బీసీ విద్యార్ధుల డైట్ బకాయిలు చెల్లించండి
-నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలు రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ -సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం -అవసరమైన మేర మరిన్ని దోభీఘాట్ల నిర్మాణం -బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ …
Read More »సమాజాభివృద్ధిలో జర్నలిస్టులే కీలకం…
-ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ ఆవిష్కరణలో పిసిసి వైస్ ప్రెసిడెంట్ శివాజీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజాభివృద్ధిలో జర్నలిస్టులే కీలకమని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొలను కొండ శివాజీ చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ2025 ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా జర్నలిస్టులతో అనుబంధం ఉందని తెలిపారు. జర్నలిస్టుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. నగరాభివృద్ధికి జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. బుడమేరు వరదల …
Read More »బర్డ్ ఫ్లూ కోళ్ల ఫారంను స్వయంగా తనిఖీ తీసిన జిల్లా కలెక్టర్ చదలవాడ
-తణుకు మండలం వేల్పూరులో జిల్లా కలెక్టర్ స్వయం పరిశీలన -వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై కలెక్టర్ ఆరా -శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత ప్రక్రియ నిర్వహించాలని ఆదేశాలు -ప్రజలు ఏటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు -10 కిలోమీటర్లు పరిధిలోపు కోడి మాంసం, గుడ్లు అమ్మకాలు నిషేధం తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను వినియోగించవచ్చని, వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ శాస్త్రీయ …
Read More »
Prajavartha Online Telugu News