మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ ఉత్సవాలను త్వరలో ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మంగినపూడి బీచ్ ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గతంలో మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎలా నిర్వహించారో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత రాష్ట్ర గనులు …
Read More »Monthly Archives: March 2025
బొబ్బిలి వీణల తయారీకి పనస కలపను కొనుగోలు చేసి ఇస్తాం
-అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత -రాష్ట్రంలో విస్తారంగా పనస మొక్కల పెంపకం -ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రూపకల్పన -రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షోరూమ్ ల ఏర్పాటు -ఆకట్టుకునేలా ప్రస్తుత షో రూమ్ ల అభివృద్ధి -బొబ్బిలి చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పిస్తాం -హస్త కళాకారులను ప్రోత్సహించండి : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బొబ్బిలి వీణ తయారీదారులకు అవసరమైన ముడి సరకు పనస చెక్కను ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి అందజేయనుందని …
Read More »తిరనాళ్ళలో జరిగిన ప్రభల ఘర్షణల మీద ఏకపక్షంగా వ్యవహరించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతమ్మ అమ్మవారి తిరనాళ్ళలో జరిగిన ప్రభల ఘర్షణల మీద ఏకపక్షంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా రూరల్ జోన్ డి.సి.పి మహేశ్వర రాజు ని కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్,జాగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. 17-03-2025 న తెల్లవారు జామున శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లసందర్బంగా అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం పసుపు కుంకుమలు సమర్పించుటకు అన్ని రాజకీయ పార్టీల వారు ప్రభలు కట్టుకొని …
Read More »రాష్ట్రంలోని పశువైద్య విద్యార్థుల మొర పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు.
-రాష్ట్రంలోని పశు వైద్య విద్యార్థులపై చిన్నచూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు దుర్మార్గమైనది. -మెడికల్ విద్యార్థులతో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు (స్టైఫండ్) గౌరవ వేతనం అమలు చేయాలి. -కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశు వైద్య విద్యార్థులు 44 రోజులుగా సుదీర్ఘ నిరసనలు నిరాహార దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమనీ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పశు వైద్య విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రభుత్వాలు …
Read More »ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష కు 33 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
-నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – I, జియోగ్రఫీ పేపర్ – I పబ్లిక్ పరీక్ష కు 33 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధ వారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 33 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా …
Read More »ఐక్యరాజ్యసమితిలో హిందీకి మరింత ప్రాధాన్యం
న్యూయార్క్, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్యరాజ్యసమితిలో హిందీ భాష వినియోగాన్ని ప్రోత్సహించే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత భారతీయ రాయబారి కార్యాలయ ప్రధాన అధికారి పర్వతనేని హరీష్‌తో న్యూయార్క్‌లోని ఆయన కార్యాలయంలో సమావేశయ్యారు. హిందీ వినియోగానికి సంబంధించిన అనేక అంశాలను వీరిరువురు చర్చించారు. ఐక్యరాజ్యసమితి నుంచి హిందీలో వార్తలను ప్రసారం చేయడంతో పాటు హిందీ భాషను మరింత మందికి చేరువ చేసే ప్రాజెక్టును …
Read More »ఎస్సీ వర్గీకరణ టీడీపీకే నష్టం… : చింతా మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ తీర్మానం చేయడం వలన తెలుగుదేశం పార్టీకే నష్టం కలుగుతోందని పార్లమెంటు మాజీ సభ్యులు చింతా మోహన్ అన్నారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ… కర్నాటకలో మాదిరిగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 24 శాతం, ఓబీసీలకు 15 శాతం ఇవ్వాలని, పేదలు, అంటరాని వారి అమాయకత్వాన్ని అండగా చేసుకుని, బలహీన వర్గాలపై బలమైన వర్గాలు దాడిగా ఆయన అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలో దళితుల్లో వందలో 90 మంది మాలలు ఉండగా, …
Read More »వర్గీకరణకు క్యాబినెట్ మరియు అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎంకు ధన్యవాదాలు…
-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్గీకరణకు క్యాబినెట్ మరియు అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాదిగ జాతి పక్షాన ఎమ్మార్పీఎస్ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు రాజీవ్ …
Read More »శాసనసభ్యులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో విజయకేతనం
అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభ్యులకు నిర్వహించిన ప్రత్యేక క్రీడా పోటీల్లో భాగంగా, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వాలీబాల్ పోటీలో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో స్పీకర్ కెప్టెన్‌గా ఉన్న “స్పీకర్ టీం” 25 పాయింట్లు సాధించి విజయం సాధించింది, హోం మినిస్టర్ టీం 20 పాయింట్లతో నిలిచింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు యువకుల తరహాలో మైదానంలో చురుకుగా కదలాడి, ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యత చూపించారు. వాలీబాల్ ప్లేయర్‌గా గతంలో మంచి అనుభవం కలిగిన స్పీకర్, అదే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తన జట్టుకు గెలుపును అందించారు. …
Read More »తానా సభలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం
అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగే తానా సమావేశాలు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని తానా ప్రతినిధులు ఆహ్వానించారు. తానా చైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా కాన్ఫరెన్స్ డెరక్టర్ సునీల్ పాంత్రా, మాజీ ప్రెసిడెంట్ జయరాం కోమటి పలువురు ఎన్నారైలు ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు.
Read More »
Prajavartha Online Telugu News