Breaking News

Monthly Archives: February 2025

ఎపిలో ఎమ్.ఐ.డి.హెచ్ (MIDH) కింద ఆమోదించిన ప్రాజెక్టుల సంఖ్య‌ 1033

-కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్ల‌డి -మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ప‌థ‌కం పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) కింద 2023-24 ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆమోదించిన మార్కెట్ మౌలిక సదుపాయాల(మండీలు, రిటైల్ మార్కెట్లు, వెండింగ్ కార్ట్లు) ప్రాజెక్టుల సంఖ్య 608 వుండ‌గా, 2024-25లో ఎమ్.ఐ.డి.హెచ్ ప‌థ‌కం ఎపిలో మంజూరైన మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల …

Read More »

మంత్రి నారా లోకేష్ కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రైల్వే ప్రాజెక్టుల‌కు రూ.9,417 కోట్లు కేటాయించినందుకు కేంద్ర ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో స‌మావేశ‌మై ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు ఢిల్లీ విచ్చేసిన విద్య‌, ఐటి శాఖ‌ల మంత్రి నారా లోకేష్ కి మంగ‌ళ‌వారం విమానాశ్ర‌యంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్వాగ‌తం ప‌లికారు. మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి పుట్టా మ‌హేష్ కుమార్, …

Read More »

ఆలపాటి రాజేంద్ర గెలుపే లక్ష్యంగా పని చేయాలి

-మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలుపే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలు కృషి చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆలపాటి గెలుపు కోసం మంగళవారం విజయవాడ భవాని పురంలోని ఎన్డీయే కార్యాలయంలో టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎమ్మెస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు …

Read More »

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు చంద్రికకిరణ్ ల వివాహ ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైసీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబ సమేతంగా కలిశారు. ఈ నెల 23 న లబ్బీపేటలోని ఎస్. ఎస్. కన్వెన్షన్ సెంటర్ నందు జరగనున్న తమ ద్వితీయ కుమార్తె చంద్రిక వివాహ వేడుకకు హాజరు కావలిసిందిగా దంపతులను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వానపత్రిక అందజేసి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరారు. పెళ్లి పత్రిక స్వీకరించిన ఆయన తప్పకుండా …

Read More »

సూర్యారాధనతో మనో వికాసం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూర్యారాధన వల్ల మనో వికాసం కలుగుతుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని మంగళవారం బుడమేరు వంతెన వద్దనున్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమస్త జగతికీ మూలాధారం.. కాలానికి అధిపతి అయిన సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి …

Read More »

సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ నియంత్రణ

-మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాలకూ పెను సవాలుగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17.5 శాతం మేర కేవలం క్యాన్సర్ వ్యాధి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో 9.93శాతం మేర …

Read More »

టీడీపీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు

-నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కృష్ణకుమారిని ఎన్నుకున్నాం -టీడీపీలో అభిప్రాయ భేదాలంటూ కొంతమంది దుష్ప్రచారం -నా అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించా -గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తప్పవు : ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నామని తెలిపారు. ‘‘టీడీపీలో అభిప్రాయ బేధాలు అని ‌కొంత …

Read More »

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి…

-సీఎం చంద్రబాబు  సూచించినట్లు ప్రతి 30 మంది ఓటర్లకు ఒక పరిశీలకుడిని నియమించాలి. -తొలి ప్రాధాన్యత ఓటుపై అవగాహన కల్పించాలి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మోహన్ రెడ్డి అనే దుష్టశక్తిని ఒకసారి భూమిలో పాతిపెడితే సరిపోదని, అతనికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎం.వి.ఆర్ కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుని ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల …

Read More »

అన్న క్యాంటీన్లకు డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లకు వచ్చిన వారికి ఆహారం అందలేదని ఫిర్యాదులు రాకుండా, డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. మంగళవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో అన్న క్యాంటీన్లకు పేద ప్రజల నుండి అనూహ్య స్పందన …

Read More »

రాష్ట్రాభివృద్ధి జ‌ర‌గాలంటే… పెద్ద‌ల స‌భ‌లో కూట‌మి అభ్య‌ర్థులుండాలి

-శాస‌నస‌భ‌కు రాని వైసీపీ నేత‌ల వ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం -టీడీపీ హ‌యాంలో 70 శాతం పూర్తయిన పోల‌వ‌రాన్ని నాశ‌నం చేశారు -ఆంధ‌ప్ర‌దేశ్ కు రాజ‌ధాని లేకుండా చేశారు -ఎమ్మెల్సీ కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి -ఇటుక ఇటుక పేర్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను పున‌ర్నిమిస్తున్నాం -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అమ‌రావ‌తి\భీమ‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి పూర్తి స్థాయిలో జ‌ర‌గాలంటే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధించాల‌ని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. …

Read More »