Breaking News

Monthly Archives: February 2025

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి12 వరకు పెంపు

-కార్యనిర్వహణాధికారి బిసి కార్పొరేషన్ శ్రీదేవి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయడానికి, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 12 వ తేదీ వరకూ పెంచడం జరిగిందనీ, అర్హులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కొరకు దరఖాస్తులు ఈ నెల 12 లోపు అప్లై చేసుకోవాలని జిల్లా బీసీ కార్పొరేషన్ …

Read More »

ఉగాది నుండి రాష్ట్రంలో పి-4 విధానం అమలుకు చర్యలు : సిఎస్ విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే ఉగాది నుండి పి-4 (పబ్లిక్-ప్రవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్ప్)విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.పి-4 విధానంపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులు,వర్చువల్ గా పాల్గొన్న జిల్లా కలక్టర్లతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి-4 విధానాన్నిఅమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకు …

Read More »

మార్గదర్శకాల మేరకు జీరో పావర్టీ దిశగా నియోజక వర్గ ప్రణాళికలు గడువులోపు సమర్పిస్తాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

-P4 పాలసీ అమలుతో నియోజక వర్గ యాక్షన్ ప్లాన్ తయారీ జీరో పావర్టీ దిశగా పక్కాగా ప్రజా ప్రతినిధులు, ప్రజల, వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఆచరణాత్మక ప్రణాళికలు గడువు లోపు తయారు కావాలి: సిఎస్ విజయానంద్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : P4 పాలసీ అమలుతో నియోజక వర్గ యాక్షన్ ప్లాన్ తయారీ జీరో పావర్టీ దిశగా పక్కాగా ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఆచరణాత్మక ప్రణాళికలు తయారు చేయాలని ఆం.ప్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష …

Read More »

హంద్రీ-నీవా విస్తరణతో ఎంతో మేలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత -మడకశిర బ్రాంచ్ కాలువ కింద 3 చానళ్ల ఏర్పాటుతో 30 చెరువులకు నీళ్లు -తక్షణమే నిధులు మంజూరు చేయండి -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద చేపట్టే వంతెనలు, కాలువల నిర్మాణంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం విజయవాడలోని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో …

Read More »

ఆక్రమణలు పునరావృతం కాకుండా భాధ్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఈ నెల 15వ తేదీలోగా వార్డ్ సచివాలయాల వారీగా డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలను పూర్తి స్తాయిలో తొలగించాలని, ఆక్రమణలు పునరావృతం కాకుండా ప్లానింగ్ కార్యదర్శులు, టిపిబిఓలు భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ గుంటూరు నగరంలో 4 ఆర్ఓబిలు నిర్మించడానికి అనుమతులు వచ్చాయని, సదరు ఆర్ఓబిలు …

Read More »

నగరంలో రోడ్లకు ప్యాచ్ వర్క్ లు ఎప్పటికప్పుడు చేపట్టాలి….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్లకు ప్యాచ్ వర్క్ లు ఎప్పటికప్పుడు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ రాజాగారి తోట, పొన్నూరు రోడ్, బాలాజీ నగర్, కొరెటపాడు, నవభారత్ నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ప్రధాన, అంతర్గత రహదారులకు వార్డ్ …

Read More »

పారిశుద్ధ్య   నిర్వహణకు మినీ గార్బేజ్  ట్రాన్స్ఫర్ స్టేషన్

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర  ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా సాంబమూర్తి రోడ్, ధర్నా చౌక్, పూర్ణానంద పేట  ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం సాంబమూర్తి రోడ్లో ఏర్పాటుచేసిన మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు, అటువంటి గార్బేజ్ స్టేషన్లు నగరంలో అవసరమైన …

Read More »

పార్కులను అభివృద్ధి చెయ్యండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పార్క్ అన్ని  అభివృద్ధి చేయాలని, ఏ పార్కులో ఎటువంటి మరమ్మత్తు ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పారిశుధ్య నిర్వహణ, 32వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు పార్కు 33 డివిజన్ సత్యనారాయణపురం నందు ఆంధ్ర రత్న పార్కు, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని పార్కులను …

Read More »

“ప్రముఖ వైద్యురాలు డా॥మారు మృతి”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు, నాస్తికోద్యమ నాయకులైన గోరా – సరస్వతీ గోరా నాల్గవ కుమార్తె డా॥మారు (80) ఈ రోజు (ఫిబ్రవరి 6, గురువారం) మధ్యాహ్నం స్వల్ప అనారోగ్యంతో కన్ను మూసారు. ఆమె ప్రముఖ వైద్యులు డా||సమరం సోదరి. ఇద్దరూ విజయవాడలో గత 55సంవత్సరాలుగా వాసవ్య నర్సింగ్ హెూమ్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆమె అనేక గ్రామాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ సేవలందించడమే కాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకి ఎంతో కృషి చేసారు. కొన్ని వేలమంది పోలియో చిన్నారులకు ఉచితంగా …

Read More »

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ -2 నెలల్లో యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు -అర్హులకే ఆర్థిక చేయూతనివ్వండి : మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని, గడువులోగా యూనిట్లు గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ …

Read More »