– మీకోసం పోర్టల్ లో గ్రీవెన్స్ నమోదుకు సమీప సచివాలయాన్ని సంప్రదించొచ్చు. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు జనవరి 29వ తేదీన షెడ్యూల్ …
Read More »Monthly Archives: February 2025
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం…
-ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు కె.వి. శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ విభాగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అధ్యక్షులు కె.వి. శివారెడ్డి, అన్నారు. అసోసియేషన్ లో భాగమైన మహిళా ఉద్యోగుల విభాగం కార్యవర్గ సమావేశం ఆదివారం గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీజీఓ హోమ్ లో మహిళా సంఘం అధ్యక్షురాలు నిర్మల కుమారి అధ్యక్షతన …
Read More »ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో నూతన అధ్యాయం
-ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో భారతదేశంలో తొలి సారిగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహకారంతో సీటీ ఎఫ్.ఎఫ్.ఆర్ టెక్నాలజీ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాశ్చాత్య దేశాల్లో ప్రివెంటివ్ కార్డియాలజీ విభాగంలో, డాక్టర్లు గుండె పోటు ముప్పును ముందుగా గుర్తించేందుకు ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్ వంటి సాంప్రదాయ పరీక్షలపై ఆధారపడకుండా, ప్రాథమిక రోగ నిర్ధారణ కోసం క్యాల్షియం స్కోర్ మరియు సీటీ యాంజియోగ్రామ్ పరీక్షలను మొదటి ఎంపికగా (గోల్డ్ స్టాండర్డ్) ఉపయోగిస్తున్నారని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ …
Read More »ఘనంగా పుష్పాలంకరణ వేడుక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి నాయకులు చిల్లా వెంకటేష్ రెడ్డి సుగుణ దంపతుల కుమార్తె చిల్లా వెంకటలక్ష్మి పుష్పాలంకరణ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పంజా సెంటర్ లోని అజీయా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ వేడుకలలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యం యస్ బేగ్ , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అతిథులుగా పాల్గొని చిన్నారి వెంకటలక్ష్మి ని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
Read More »ఉత్సాహంగా ఆక్వా డెవిల్స్ ఈత పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి ఫెస్టివల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా నదిలో ఆదివారం నిర్వహించిన ఈత పోటీలకు మంచి స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్విమ్మర్స్ ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , డాక్టర్ కామినేని పట్టాభి రామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దుర్గా ఘాట్ నుంచి లోటస్ ఫుడ్ ప్లాజా …
Read More »గాయత్రి ప్రజ్ఞాపరివార్ ఆధ్వర్యంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సరస్వతీ దేవి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని గాయత్రీ ప్రజ్ఞాపరివార్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్టినగర్ లోని బాయన కనకదుర్గాంబ ఆధ్యాత్మిక కేంద్రంలో వసంత పంచమి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ లు ఈ వేడుకలలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరికి లభించాలని కోరారు. ఆకుల కుమార్ ,బాయన హేరంభ కుమార్ …
Read More »ఎస్సీఈఆర్టీలో ఆన్ డ్యూటీ విధానంలో అసెస్మెంట్ నిపుణుల భర్తీకి ఆహ్వానం
-ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీఈఆర్టీలో పది అసెస్మెంట్ నిపుణుల (Assessment experts) ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుండి ఆన్ డ్యూటీ ప్రాతిపదికన ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలు ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యా సంచాలకులు వి.విజయ్ రామరాజు IAS ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్టేట్ అసెస్‌మెంట్ సెల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి https://forms.gle/qFRjhWHMtVJ5UXUT8 …
Read More »ఇది..పేదల సంక్షేమ, అభివృద్ధి వ్యతిరేక బడ్జెట్
-ఉపాధి హామీకి మొండిచేయి.. -కార్పొరేట్, పెట్టుబడిదారి వర్గాలకు లబ్ది -ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్‌లో ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంతా పాతదనమేనని, అందులో కొత్తదనం ఏమీ లేదని, ఈ బడ్జెట్ వల్ల పేదలకు ఏమి ఒరిగింది లేదనీ, ఆహార ధరలు తగ్గింపు కానీ, ఆరోగ్యం, విద్య, వైద్యం, వివిధ సంక్షేమ పథకాల గురించి ఏ మాత్రమూ కనికరించలేదని, నామమాత్రపు కేటాయింపులతో గొప్పలు చెబుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర …
Read More »సీఎం చంద్రబాబుకు ఎంపికేశినేని శివనాథ్ స్వాగతం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే భాగస్వామిగా బిజెపి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఢిల్లీ విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంపి కేశినేని శివనాథ్ ఘనస్వాగతం పలికారు. ఆదివారం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ ఎంపి సానా సతీష్ లతో …
Read More »కొండ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
-5వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ -హోరేబు మినిస్ట్రీస్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్‌లోని పెదబావి సెంటర్ సమీపంలో కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా తెల్సుకున్నారు. కొండ ప్రాంతంలో రోడ్లు, రెయిలింగ్, మెట్లు …
Read More »
Prajavartha Online Telugu News